Venkatesh1

May 07 2024, 06:51

జనం జగనన్న వైపే.. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేద్దాం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
జనం జగనన్న వైపే.. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేద్దాం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపడం ఖాయం ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ప్రజలంతా అధికశాతం జగనన్న వైపే ఉన్నారని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు. పుట్లూరు మండల కేంద్రంలో, మరియు కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, నాగిరెడ్డిపల్లి, నాయకునిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని, మరియు రోడ్డు షో ను వీరాంజనేయులు చేపట్టారు. పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి జగనన్న చేసిన మేలుని వివరించారు. ఈవీఎం మెషిన్ లో 3 వ నెంబర్ వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..గత రెండు నెలల నుంచి ఏ పల్లెకు పోయినా తనను సోదరుడిలా భావించి ఆశీర్వదిస్తున్న శింగనమల నియోజకవర్గ ప్రజలకు శిరసు వంచి రెండు చేతులు జోడించి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా ఏ ఇతర సర్టిఫికెట్లు కావాలన్నా ఆఫీసర్ల ముందర చేతులు కట్టుకుని నిలబడి వాళ్ల దయా దక్షిణ్యాల మీద మనం ఆధారపడేవాళ్ళం. జగనన్న ప్రభుత్వం వచ్చాక మనకు అతి దగ్గరలో ఉన్న సచివాలయాల్లోనే అన్ని సేవలు అందుతూ ఉన్నాయన్నారు.

రెండేళ్లు కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా వణికిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మాత్రం ఎక్కడా సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి ఇంటికి అందించారన్నారు. టిడిపి ఒంటరిగా పోటీ చేసి గెలవలేననే భయంతో జనసేన ని కలుపుకొందని, అయినా ధైర్యం చాలక ఢిల్లీ దర్బార్ ముందు సాగిలపడి బిజెపితో కూడా జతకట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలోని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 2024 లో టిడిపిని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. మరోసారి జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

May 06 2024, 08:18

టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీని పరామర్శించిన.. ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటీమడుగు కేశవరెడ్డి..
శింగనమల నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గములో విరామం లేకుండా ప్రచార కార్యక్రమం చేశారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావంతో బండారు శ్రావణిశ్రీ గారు వడదెబ్బకు గురయ్యారు. ఇంటిలో వైద్య సేవలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకట శివ యాదవ్ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు ముంటీమడుగు కేశవరెడ్డి గారు,అనంతపురం జిల్లా ఎన్నికల సమన్వయకర్త ఈరన్న గారు శింగనమల నియోజకవర్గం పరిశీలకులు గుర్రప్ప నాయుడు గారు బండారు శ్రావణి గారి నివాసానికి వెళ్లి పరామర్శించిన సందర్భంగా. అలాగే ప్రజలు, టిడిపి శ్రేణులు, అభిమానులు, అందరూ వడదెబ్బకు గురైన బండారు శ్రావణి శ్రీ గారు త్వరగా ఆరోగ్యంగా కోలుకొని మరి ప్రజలతో కలిసి ప్రచారంలో పాల్గొనాలని ప్రజలు ప్రార్థించారు.

Venkatesh1

May 06 2024, 07:56

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో 100 మంది టీడీపీ లోకి
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగారెడ్డి మరియు జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో 100 మంది టీడీపీ లోకి చేరినారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీలో జన చైతన్య కాలనీ,రామిరెడ్డి కాలనీ,ఎల్బీ నగర్ కాలనీ, గాయత్రి కాలనీలలో *టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో 100 మంది వైస్సార్సీపీ పార్టీ నుండి తెలుగుదేశంపార్టీలోకి చేరినారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,పొడరాళ్ళ రవీంద్ర, మాజీ ఎంపీపీ SK వెంకటేష్, మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ, కేశన్న, నారాయణ స్వామి, సాయి నాథ్ రెడ్డి,బాబాయ్య లోక్ నాథ్ రెడ్డి, బాబా ఫకృద్దీన్ వలి , టోపీ బాషా తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Venkatesh1

May 06 2024, 07:45

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టిద్దాం.. వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టిద్దాం.. వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ◆ హోరెత్తిన ఎన్నికల ప్రచారం అడుగడుగునా ప్రజల నీరాజనం ◆ నియోజకవర్గంలో టిడిపి ఓటమి భయంతో జిమ్మిక్కులు.. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టించాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు కోరారు. శింగనమల మండలం గుమ్మేపల్లి, ఏకులనాగేపల్లి, కల్లుమడి, తరిమెల గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణతో, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఏడిసిసి బ్యాంక్ మాజీ ఛైర్మన్ తరిమెల కోనారెడ్డి, తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, కంచె రెడ్డి భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డిలతో కలసి గడప గడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు.

కల్లుమడి గ్రామంలో ఎమ్మెల్యే, ఎంపీ, అభ్యర్థులకు పార్టీ నాయకులు గజమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం తరిమెల గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థికి స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. ఈవీఎం మెషిన్ లో 3 వ నెంబర్ వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారని, అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసి పేద కుటుంబాలు సంతోషంగా ఉండేలా పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఐదేళ్ల జగనన్న పాలనలో రెండేళ్లు కరోన మింగేసినా, ఉన్న మూడేళ్లలోనూ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కూటమి మేనిఫెస్టో అంతా బూటకమేనన్నారు. నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఐదేళ్లలో ప్రజలకు కనిపించని టీడీపీ అభ్యర్థి కూడా ఓట్ల కోసం నానా.. తంటాలుపడుతూన్నారన్నారు. అలాంటి వారు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటమి భయంతో జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ప్రజలు టిడిపి వాగ్దానాలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగనన్న అవడం ఖాయం అన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

May 05 2024, 07:03

టిడిపి నుంచి వైసీపీలోకి చేరుతున్న టిడిపి కార్యకర్తలు..

టిడిపి నుంచి వైసీపీలోకి చేరుతున్న టిడిపి కార్యకర్తలు..

బుక్కరాయసముద్రం మండలం లో నుంచి వరుస పెడుతున్న టిడిపి కార్యకర్తలు నాయకులు తలారి పోతలయ్య , పాముల నాగభూషణ్ రెండు కుటుంబాలు ఈరోజు వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది 

బుక్కరాయసముద్రం మండల ఇన్చార్జ్ ఆలూరి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కుల మత పార్టీ తేడా చూడకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు..

Venkatesh1

May 04 2024, 07:11

టిడిపి నుంచి వైసీపీకి చేరిక...

టిడిపి నుంచి వైసీపీకి చేరిక...

బుక్కరాయసముద్రం మండలంలోని పాముల శ్రీనివాసులు , ఉప్పరపల్లి నాగరాజు , గోసల నాగరాజు , ఆలూరు సాంబశివరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలము చూసి తాను పార్టీలో చేరుతున్న చెప్పడం జరిగింది ..

Venkatesh1

May 04 2024, 07:05

నార్పల మండలం బి పప్పూరు గ్రామం లో తమ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేపట్టిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బి పప్పూరు గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైకాపా నాయకులు ప్రజాధరణ పొందలేక పోయారని జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని, అందువల్లనే నాయకులు, కార్యకర్తలు వైసిపిని వీడి టీడీపీలో చేరుతున్నారని కూటమి లక్ష్యాలు టీడీపీ ప్రజాకార్షక పధకాలను మెచ్చి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని రానున్న ఎన్నికల్లో NDA కూటమి విజయం ఖాయమని మళ్ళీ జగన్ అధికారం చేపడితే రాష్ట్రం మరో బీహార్ అవుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు కు ఓటు వేయాలని గ్రామస్థులను ఆలం నరసానాయుడు తెలియజేసారు. 

అలాగే 

వైసిపి పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి చేరికలు

బి పప్పూరు,గూగూడు గ్రామాలకు చెందిన పలువురు వైసిపి నాయకులు,కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకి చేరిన పి లక్ష్మి నారాయణ రెడ్డి,హరిజన హరి,సాకే శ్రీనా, తలారి తిరుపతయ్య,ఆత్మకూరు నల్లప్ప,ఆత్మకూరు రాజశేఖర్,ఆత్మకూరు రమేష్, వెంకటరాముడు,గంగాధర్,మస్తాన్,మస్తాన్,రాజేష్,రాజశేఖర్,పెద్దిరాజులు, శీనప్ప శ్రీరాములు వీరందరు తెలుగుదేశం పార్టీ లోకి చేరారు.వారికి పార్టీ లోకి ఆహ్వానించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు

ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Venkatesh1

May 04 2024, 06:53

సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు నాయుడు..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

జగనన్నతోనే పేదల భవిష్యత్తుకు భరోసా

● వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలోఎన్నో మైలురాళ్లు

● ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజల ఎదురుచూపులు

◆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

● హారతులు పట్టి స్వాగతం పలికిన మహిళలు

● సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు నాయుడు

గడచిన ఐదేళ్లలో ఒక పక్క సంక్షేమాన్ని, మరోపక్క అభివృద్ధిని అందించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నదేనని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం కనంపల్లి, పాపినేపాళ్యం, ఎగువపల్లి, కల్లూరు గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు.

మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా ప్రజలను పలకరిస్తూ జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అదే బాటలో 2024లో కూడా నెరవేరని హామీలతో ప్రజలని మోసం చేయటానికి కూటములతో వస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నడిపించారన్నారు. ఆమె చేసిన అభివృద్ధి నా విజయానికి తోడ్పాటు అవుతుందన్నారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పాలన అందించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో ప్రజలు కరోన కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి అభ్యర్థి కనిపించలేదన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారా అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కష్టం విలువ తెలిసి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అందరికీ సేవకుడిగా ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

May 03 2024, 09:16

ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దలు కోల్పోయిన కుటుంబానికి 10000 రూ.లు ఆర్థిక సాయం చేసిన కే రామలింగారెడ్డి టిడిపి రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి

ఇటీవల జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం అందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, కేసన్న, పెద్దప్ప, సత్తి, వెంకట్,గుండు సత్తి, ఎర్రి స్వామి,వడ్డే సుంకన్న, అనంతపురం పార్లమెంట్ కమిటీ మైనారిటీ అధికార ప్రతినిధి వెంకటాపురం దాదు మొదలగువారు పాల్గొన్నారు

Venkatesh1

May 03 2024, 09:09

నార్పల మండలo బండ్లపల్లి గ్రామం లో టిడిపి ఎన్నికల ప్రచారం.. రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలo బండ్లపల్లి గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామం లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు, ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి గా అంబికా లక్ష్మి నారాయణ గారి ని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని జగన్ సిద్ధం సభలన్నీ అబద్ధపు సభలు అని, మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిన పొదుపు సంఘాల డబ్బులు కూడా సొంత పార్టీ ప్రయోజనాలకోసం జగన్ వినియోగించు కున్నారని, పేద కుటుంబాలు పండుగ చేసుకునేందుకు గత ప్రభుత్వంలో కానుకలు ఇచ్చేదని వాటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, నాగుళూరు పంచాయతీ లో అభివృద్ధి జరిగింది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నపుడే అని కావున వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుందామని ఆలం నరసానాయుడు తెలియజేసారు.. ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.